ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు. బర్రెలక్కతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ ఓటమి చవిచూశారు. అయితే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువగా బర్రెలక్క పాపులారీటీ సాధించిన ఓడిపోయింది.
Read Also: Bajaj Chetak Premium: బజాజ్ చేతక్ అప్‌డేట్ వెర్షన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్, ధర?
అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ( కర్నె శిరీష) అందరి దృష్టిని ఆకర్షించింది. బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్ అయిన ఆమె తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. విజిల్ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన బర్రెలక్కకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు వచ్చాయి.. రెండో రౌండ్‌లో 262 ఓట్లు పోలైయ్యాయి. బర్రెలక్కకు మొత్తం 4 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో హేమా హేమీలు బరిలో ఉన్న చోట బర్రెలక్క ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. శిరీషి ఓడిపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు..