Kolkata : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచింది. అయితే దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదు.
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు…
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్‌కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె…
Kolkata : కోల్‌కతా అత్యాచార, హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ నిరంతరం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఇద్దరు పోలీసు అధికారులను సీబీఐ బుధవారం మరోసారి విచారించింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలని దాదా పేర్కొన్నాడు.
Kolkata Rape Case : కోల్‌కతా రేప్ కేసులో ఆరోపణలతో చుట్టుముట్టిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం-హత్య కేసుకు సంబంధించి ఆర్‌జి కర్ ఆసుపత్రి కేసులో ఇడి వేర్వేరు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఈడీ బృందాలు మూడు చోట్ల దాడులు నిర్వహిస్తున్నాయి.
Kolkata rape-murder case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్‌ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒక వైపు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది. అయినా విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.