Kolkata rape-murder case: నాకు రోటీ-సబ్జీ వద్దు, ఎగ్ న్యూడిల్స్ కావాలి.. నిందితుడి డిమాండ్..
- రోటీ-సబ్జీ వద్దు.. ఎగ్ న్యూడిల్స్ కావాలి..
- కోల్‌కతా అత్యాచార నిందితుడి డిమాండ్..
- జైలు రూల్స్ ప్రకారం ఖైదీలందరికి ఒకే రకం ఫుడ్..
- సంజయ్ రాయ్‌ని మందలించిన జైలు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata rape-murder case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్‌ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
Read Also: Pakistan: పాక్‌కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారం విషయంలో కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ కూర, రోటీకి బదులుగా తనకు ఎగ్ చౌమీన్(ఎగ్ న్యూడిల్స్) డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో భోజనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఎగ్ చౌమీన్ తినడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే, జైలు నిబంధనల ప్రకారం, ఖైదీలందరికి ఒకే రకమైన ఆహారాన్ని అందిస్తారు. దీంతో సంజయ్ రాయ్ డిమాండ్‌ని అధికారులు పట్టించుకోలేదు.
రోటీ, కూరగాయలతో తయారు చేసిన కర్రీని వడ్డించడంపై అతను ఆగ్రహంగా ఉన్నాడని, అయితే జైలు అధికారులు మందలించిన తర్వాత చివరకు తినడానికి అంగీకరించాడని నివేదిక పేర్కొంది. ఆగస్టు 09న జరిగిన ఘటనలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సెమినార్ హాలు నుంచి సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4.03 గంటలకు ప్రవేశించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో కనుగొనబడింది. రాయ్‌కి చెందిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఘటన స్థలంలో కనుగొనబడింది. ఇదే కాకుండా అతడి చెంపపై గాయాలు, ఎడమ ఉంగరపు వేలు మధ్య ఎడమ చేతిలో రాపిడి, అతడి ఎడమ తొడపై గాయాలు వంటి సంకేతాలను పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు