Kolkata Murder Case: రేపు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్..
- ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు బంద్..
- 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు..
- 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆరోగ్య సేవలు స్తంభించగా, తోటి విద్యార్థికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.
Read also: Special 19Team : జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్ 19’ టీమ్ ఏర్పాటు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
కాగా, ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ బోస్ సంబంధిత జూనియర్ వైద్యులతో మాట్లాడారు. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసనలు తెలుపుతున్నారు. విధుల నుంచి బహిష్కరించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
Read also: Eatala Rajendar: బీజేపీ లో బీఆర్‌ఎస్ విలీనం అనేది అబద్ధం.. అలాంటి చర్చ లేదు..
మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యపై పశ్చిమ బెంగాల్ అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళా స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అర్ధరాత్రి మహిళలు నిరసన తెలిపారు. ఆందోళనకారులుగా చెప్పుకుంటున్న దాదాపు 40 మంది వ్యక్తులు గురువారం అర్ధరాత్రి RG కార్ హాస్పిటల్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులు ఆస్పత్రి ఆవరణలోకి చేరుకుని అత్యవసర విభాగం, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!