Kolkata Doctor Murder: 13 రోజులు గడిచినా కోల్‌కతాలో డాక్టర్ రేప్ హత్య మిస్టరీ వీడలేదు. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐ 11 రోజులుగా విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు 100 మందికి పైగా విచారించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.