కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని రక్షించేందుకు సీనియర్ కోల్‌కతా పోలీస్ ప్రయత్నించాడని సీబీఐ ఆరోపించినట్లు తెలిసింది. పోలీస్ అధికారి…
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్‌కతా పోలీస్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను అరెస్టు చేసింది.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేల సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు.
Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి ఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్‌లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశంలో నిరసనలకు కారణమైంది. బెంగాల్‌లో ఇప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశానికి డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు.
నార్కో టెస్ట్ లేదా నార్కో అనాలిసిస్ అని కూడా పిలుస్తారు. ఇది హిప్నోటిక్ లేదా సెమీ-కాన్షియస్ స్థితిని ప్రేరేపించే ఔషధాన్ని అందించడం ద్వారా ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించే ఒక రకమైన పరిశోధనాత్మక విధానం.