Kolkata Doctor Murder Case: కోల్‌కతా హస్పటల్ విధ్వంసం.. ఇద్దరు ఏసీపీలు, ఓ ఎస్ఐ సస్పెన్షన్..!
- కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసం..
- ఇద్దరు ఏసీపీలు.. ఒక ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Murder Case: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆ టైంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా పోలీసు విభాగం ఇవాళ (ఆగస్ట్ 21) సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఘటన జరిగిన టైంలో హస్పటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పైన వేటు పడింది.
Read Also: Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
కాగా, హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా ఆందోళనలు తెలుపుతుంటే.. మరోవైపు ముసుగులు ధరించిన కొందరు విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు జరిపారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతో పాటు సీసీ టీవీలను కూడా పగలకొట్టారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సుమారు 40 మంది నిరసనకారుల రూపంలో అర్థరాత్రి వచ్చిన దుండగులు ఆసుపత్రిలో ఈ విధ్వంసం సృష్టించారు.. వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..
ఇక, ఈ విధ్వంసాన్ని నిలువరించటంలో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆ టైంలో అక్కడే నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆరోపణలు చేశారు. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ సైతం తమవైపు తప్పు జరిగిందని మరుసటిరోజే తెలిపారు. దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారని.. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!