అమెరికాలోని టాంపా నగరంలో ఎన్‌ఆర్‌ఐ టిడిపి బృందం ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కొడెల శివప్రసాదరావు తనయుడు కొడెల శివరామ్‌తో తెలుగు వాళ్ళు ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంఘ సభ్యులు, ఎన్‌ఆర్‌ఐ టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామ్ గారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అలాగే భవిష్యత్తులో టిడిపి చేయబోయే కృషి గురించి మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐ టిడిపి బృందం…
టీడీపీ అంటే మా ప్రాణం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ కోసమే ప్రాణాలు వదిలారు అని కోడెల శివరాం తెలిపారు. పార్టీని విడిపోవాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు.. కోడెల పేరు వినపడకూడదని ఆలోచనతో కొంత మంది నియోజకవర్గంలో మా మీద దుష్ప్రచారం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Telugu Desam Party: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అనుమతులు తీసుకోకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంపై వివాదాస్పదం అవుతోంది. మరోవైపు అన్నా క్యాంటీన్‌ల ఏర్పాటు విషయంలో టీడీపీ నేతల్లో సమన్వయం కొరవడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. పోటీపోటీగా…
గుంటూరు జిల్లా పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు చేపట్టాలంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నేత కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన కోడెల శివరాం టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం…
రాజకీయాల్లో తండ్రి ఓ వెలుగు వెలిగితే.. తనయుల పొలిటికల్ భవిష్యత్‌కు ఢోకా ఉండదు. కానీ.. ఆ వారసుడికి మాత్రం సీన్ రివర్స్. వారసుడి గత చరిత్రను ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది పార్టీ కేడర్. నేను మారిపోయాను బాబోయ్ అని.. ఆయన నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విశ్వసించడం లేదట. దాంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందో లేదో అని చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరాయన? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం కోడెల శివరామ్ యత్నం! కోడెల శివరామ్. మాజీ…