Kodela Sivaram: టీడీపీ అంటే మా ప్రాణం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ కోసమే ప్రాణాలు వదిలారు అని కోడెల శివరాం తెలిపారు. పార్టీని విడిపోవాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు.. కోడెల పేరు వినపడకూడదని ఆలోచనతో కొంత మంది నియోజకవర్గంలో మా మీద దుష్ప్రచారం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న చనిపోయిన తర్వాత నిరూపితం కాలేని ఆరోపణలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబును కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వం ఇది.. అలాగే మా కుటుంబం మీద కూడా ఆరోపణ చేసింది.. ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ లేవు అని కోడెల శివరాం పేర్కొన్నారు.
Read Also: Earth Hour : గంట లైట్లు బంద్.. ఎందుకో తెలుసా..?
టీడీపీ అధిష్టానం పిలిస్తే వెళ్లి కలిసి వచ్చాను.. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చెప్పారు అని కోడెల శివరాం తెలిపారు. మా పార్టీ అధినేత చంద్రబాబును కలిసి నా రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటా.. పార్టీని విడిచి వెళ్ళేది లేదు అని స్పష్టం చేశారు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మా కుటుంబంపై ఎన్నో కేసులు పెట్టిన మేము ఇప్పటి వరకు టీడీపీ పార్టీని వదిలి పెట్టలేదు అన్నారు. మా రక్తం, తెలుగుదేశం పార్టీ, మా రక్తం పసుపు రక్తం.. మేము ఎప్పుడు పార్టీ అధ్యక్షుడి మాటను జావదాటలేదు అని కోడెల శివరాం వెల్లడించారు.