తెలంగాణ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. ఎన్నికలకు గడువు చాలా ఉన్నా.. పార్టీలు మాత్రం ఎవరి వ్యూహానికి వాళ్లు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక స్ట్రాటజీని అందజేశారట పార్టీ వ్యూహకర్త సునీల్. ఆ వ్యూహంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌లు రహస్యంగా భేటీ అయ్యారట. ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ నాయకులకు.. ఇటు TJS ప్రతినిధులకు కూడా తెలియదట. దాంతో రేవంత్, ప్రొఫెసర్ ఇద్దరూ ఎందుకు రహస్యంగా…