School Bus: ఖమ్మం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నడిరోడ్డుపై స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయింది.
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి…
సూర్యాపేట జిల్లాలో కోదాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎవరితో కలిసి పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పర్యటిస్తారని.. తాను కూడా తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. KCR: కేసీఆర్ ఆలిండియా టూర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇక మరో మూడురోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం మొదలైయిపోయింది. ఇక థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ షురూ చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్లతో థియేటర్లను అలకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే…
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే…