టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీలో విధ్వంసకరమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్న షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనటం లేదనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఐపీఎల్2023లో గెలుపుతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.