Athiya Shetty-KL Rahul wedding: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. నాలుగేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకోలేదు.. కానీ, వారి ఫొటోలు, వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ వచ్చాయి.. మొత్తంగా పెళ్లి పీటలు ఎక్కెందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.. ఇవాళ శెట్టి…
Team India: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు. అయినా కేఎల్ రాహుల్ ఆటను అచ్చుగుద్దినట్లు ఓ ఆటగాడు దింపేశాడని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అతడు ఎవరో కాదు శుభ్‌మన్ గిల్. శ్రీలంకతో టీ20 సిరీస్‌తోనే గిల్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే అతడు టీ20 తరహాలో ఆడకుండా జిడ్డు బ్యాటింగ్ చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు. వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్‌ను టీ20ల్లోకి తీసుకుంటే చెత్త బ్యాటింగ్ చేశాడని…
Team India: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను నెగ్గడానికి టీమిండియా తల ప్రాణం తోకకు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రెండో టెస్టులో ఓటమి దిశగా సాగి భారత ఆటగాళ్లు కలవరపెట్టారు. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అశ్విన్ భారత్ పరువు కాపాడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే తదుపరి సిరీస్‌పై అందరి కన్ను పడింది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా…
ఛట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరంభంలోనే టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20) విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో పుజారా (12),…
IND Vs BAN: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చిట్టగ్యాంగ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా టెస్టు సిరీస్‌లో గెలవాలని భావిస్తోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ సమస్యలతో సతమతం అయ్యాడు. ఫామ్ కారణంగా అతడు చివరకు కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ అన్నదే రాలేదు. అయితే ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మేరకు కెరీర్లో…