Athiya Shetty-KL Rahul wedding: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. నాలుగేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఒప్పుకోలేదు.. కానీ, వారి ఫొటోలు, వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ వచ్చాయి.. మొత్తంగా పెళ్లి పీటలు ఎక్కెందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు.. ఇవాళ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరి పెళ్లి జరగనుంది.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వీరిద్దరూ ఒక్కటికాబోతున్నారు.. అతియా మరియు కేఎల్ రాహుల్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది..
Read Also: IT Layoffs: ఐటీ ఉద్యోగులపై పిడుగు.. రోజుకు 3000 మంది ఉద్యోగాలు ఊస్ట్
మొత్తంగా టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ కే ఎల్ రాహుల్‌తో అతియ శెట్టి వివాహం ఇవాళ అంగరంగ వైభవంగా జరగబోతోంది.. మహారాష్ట్రలోని ఖండాలలో సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో శనివారం ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.. పెళ్లి తర్వాత బెంగళూరు, ముంబైలో రిసెప్షన్ పార్టీలు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.. దీనికి టీమిండియా ప్లేయర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వివాహ ప్రమాణం చేయనున్నారని.. వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో. ఆచారాలను అనుసరించి సాయంత్రం 6:30 గంటలకు పెళ్లి తంతు ఉంటుందని తెలుస్తోంది.. అయితే, 21 సాయంత్రం ఇంటిమేట్ కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.. దీని తర్వాత జనవరి 22న మెహందీ మరియు హల్దీ వేడుకలు జరిగాయి. ఇక, ఇవాళ పెళ్లి జరగనుండగా.. ముంబై మరియు బెంగళూరులో తమ స్నేహితులు మరియు క్రికెట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.