Jasprit Bumrah, KL Rahul likely to play Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్‌సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ…
Google AI Gives 3 Captaincy Options For India In Test Cricket: ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ రెండోసారి కూడా రన్నరప్‌కే పరిమితం అవడం చాలా మందికి మింగుడుపడడం లేదు. దాంతో రోహిత్ కెప్టెన్సీపై…
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి ప్రతేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఐపీఎల్ లో గాయపడి బయటికి వచ్చేశాడు రాహుల్. రాహుల్ కుడి తొడపై తీవ్రమైన గాయం కావడంతో తాను ఈ గేమ్ కు అన్ ఫిట్ ను తనకు తానే ప్రకటించుకొని బయటకు వచ్చేశాడు.
తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
రాహుల్ ఐపీఎల్ 2023కి దూరం అయ్యాడు. రాహుల్ ఫ్రాంచైజీని విడిచిపెట్టి స్కానింగ్ కోసం ముంబైకి బయలుదేరాడు. క్రిక్‌బజ్ నివేదిక నుంచి ఈ సమాచారం అందింది. ఫీల్డింగ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో రాహుల్ చేర్చబడ్డాడని, అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన జట్టులో అతను ఉన్నాడు.
గంభీర్, కోహ్లీ మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లీ, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. దీంతో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్‌ను కోహ్లీకి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేందుకు క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.