Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి.