గాంధీ కుటుంబానికి అమేథీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కేఎల్. శర్మ ఓడించారు. 2019లో అమేథీలో స్మృతి ఇరానీ విజయం సాధించారు
Kishori Lal Sharma: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థుల్ని ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అమేథీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడ నుంచి తిరిగి లేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ అధిష్టానం ఊరించి.. ఊరించి ఎట్టకేలకు శుక్రవారం ఉదయం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది.