కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతున్న సందర్భంలో.. దేశప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి, సరైన బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు. సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందనే విషయాన్ని దేశప్రజలు గమనించాలన్నారు. అంతేకాకుండా..’మొదట్నుంచీ అవకాశం…
దేశంలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం చేసేలా పాలన కొనసాగించారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకంతో లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించారు.. ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం లో అనేక జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారన్నారు. కోట్లాది ఇల్లు…
హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆదివారం నారాయణగూడ ప్రాంతం మార్మోగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో అయ్యప్పస్వామి మహా పడిపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఏర్పాట్ల లేమి కారణంగా తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇంచార్జులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో వ్యక్తి కేంద్రీకృతంగా పోస్టులు పెడితే వేటు తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Kishan Reddy: కర్ణాటకలో కాంగ్రెస్ నీ గెలిపించిన ప్రజలు తలలు పట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయంను కాల రాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత అలవాటు ను కొనసాగించిందన్నారు.
Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు