AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ మరియు పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధుల విడుదలకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులుతో సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు.. Read…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి…
Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు…
ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్‌కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైందని మంత్రి అచ్చెన్నాయుడు…
శాసనమండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనమండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని, గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి ఏమీ మాట్లాడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అని బొత్స ఫైర్ అయ్యారు.…
ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.. రాయితీపై బిందు సేద్యం అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యానికి అవసరమైన ఎక్విప్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు.