పల్నాడు రాజకీయాలు మళ్లీ హీటుపెంచుతున్నాయి.. అయితే, పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్ పుట్టిన రోజు బహుమతిగా మైనారిటీ సోదరుని శవాన్ని గోపిరెడ్డి అందించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. వైసీపీ వచ్చాక మైనార్టీలను ఊచకోత కోస్తున్నారని విమర్శించారు.. ముగ్గురు ఉన్మాదులు పల్నాడును వల్లకాడు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. పిన్నెల్లి, కాసు, గోపిరెడ్డిలని పల్నాడు నుంచి ప్రజలు తన్ని తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం…
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడితున్నారని ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో నీవు ఏ పార్టీకి ఓటేస్తావు.. ఏ పార్టీ తరఫున నామినేషన్ వేస్తావు..? అంటూ అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. పార్టీలేదు, బొక్కాలేదు అన్న పార్టీకే నామినేషన్ వేస్తావా..? నీకు సిగ్గుందా..! అంటూ ఫైర్ అయిన ఆయన.. 18 నెలలు ముందే నా టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది… నీ…
సీఎం వైఎస్ జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అన్నారు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్యగా మండిపడ్డ ఆయన.. ఈ ఘటనకు సీఎం వైఎస్ జగన్, జిల్లా మంత్రి…
రాజకీయాల్లోకి వచ్చీరాగానే రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఆ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి లోక్‌సభ బరిలో ఉంటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆ యువనేత ఇంట్లో మరో చర్చ జరుగుతోందట. ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు టాక్. నియోజకవర్గాన్నీ ఎంపిక చేసేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి.. ఆ యువనేత కోరికను పార్టీ అధినేత మన్నిస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు? శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు ఫ్యామిలీది…
శ్రీకాకుళం టీడీపీలో మెదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ప్రకటించిన ఆయన.. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారని.. బాదుడే బడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తుందని పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డ…
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి…