North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు.
నార్త్ కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవులలో ఈ డ్రిల్స్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. దీనిపై నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా రియాక్ట్ అయ్యింది. బార్డర్లో సైనిక విన్యాసాలు చేపట్టడం.. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు.
Kim Jong Un's Sister Warns south korea: ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న చెల్లిలు.. శక్తివంతమైన నాయకురాలు యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా వల్లే ఉత్తర్ కొరియాలో కోవిడ్ ప్రబలిందని ఆమె ఆరోపించారు. అయితే కోవిడ్ వ్యాధిని ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని ఆమె అన్నారు. తాజాగా కిమ్, ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. ఈ…
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా…
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని నెలల క్రితం రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ను ధ్వంసం చేశారు. మరోసారి కొరియా యుద్ధం తప్పదేమో అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. అయితే, నెల రోజుల క్రితం నుంచి క్రమంగా మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో ద్వంసం చేసిన కార్యాలయాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఇరుదేశాల అధినేతలు హాట్‌లైన్‌లో మూడుసార్లు చర్చించుకున్నారు. కొరియా మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. …