Kim Jong Un’s sister: ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ.. తమ సైనిక బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. పొరుగు దేశాన్ని భయాందోళనలకు గురి చేసేందుకు ట్రై చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ చేసింది. నార్త్ కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవులలో ఈ డ్రిల్స్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. దీనిపై నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా రియాక్ట్ అయ్యింది. బార్డర్లో సైనిక విన్యాసాలు చేపట్టడం.. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను రెచ్చగొడితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కొరియా డ్రిల్స్ కు జవాబు చెప్పే పనిలో తమ సైనిక బలగాలు బిజీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు కిమ్ యో జాంగ్ స్టేట్ మెంట్ ను ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ మీడియాకు రిలీజ్ చేసింది.
Read Also: Ayushman Bharat: రూ.10లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య భీమా
అయితే, ఇటీవలి కాలంలో రెండు కొరియా దేశాల మధ్య బెలూన్ వార్ జరిగింది. భారీ బెలూన్లలో చెత్త మూటలు కట్టి తమ పొరుగు దేశంలోకి పంపాయి. దక్షిణ కొరియా ఈ బెలూన్లతో పాటూ బార్డర్ లో భారీ లౌడ్ స్పీకర్లను పెట్టి పాప్ మ్యూజిక్ ప్లే చేసింది. నార్త్ కొరియాకు వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్లతో కూడిన బెలూన్లకు కట్టి ఆ దేశంలో వదిలిపెట్టింది. ఈ చర్యలను కిమ్ జోంగ్ ఉన్ ఆగ్రహంతో ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాడు.