ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలను మరియు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈవారం కూడా అనేక చిత్రాలు మరియు వెబ్ సిరీసులు ఓటీటీలలోకి వచ్చేసాయి.. అందులో కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ కూడా వుంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వస్తోన్న కిల్లర్ సూప్‌లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించాడు. మనోజ్ బాజ్ పాయి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో మనోజ్‌కు విలన్‌గా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ సత్య సినిమా నుంచి నిన్నటి సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై వంటి ఓటీటీ మూవీ వరకు ఎన్నో వైవిధ్య పాత్రలతో అలరిస్తున్నాడు మనోజ్ బాజ్ పాయి.ఇప్పుడు మరో కొత్త పాత్రలో, సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో మనోజ్ బాజ్ పాయి చేసిన సిరీస్ కిల్లర్ సూప్. ఇందులో మనోజ్ బాజ్ పాయ్‌తోపాటు బాలీవుడ్ పాపులర్ నటి కొంకణా సేన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కిల్లర్ సూప్ వెబ్ సిరీసుకు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు షాహిద్ కపూర్ ఉడ్తా పంజాబ్ మరియు దివంగత సుశాంత్ రాజ్ పుత్ సింగ్ నటించిన సోంచిరియా, విద్యా బాలన్ ఇష్కియా అలాగే దేడ్ ఇష్కియా వంటి డార్క్ క్రైమ్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయం సాధించారు.
ఇప్పుడు మరోసారి కిల్లర్ సూప్ వెబ్ సిరీసుతో ఓటీటీలో సక్సెస్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. కిల్లర్ సూప్ సినిమాలో మనోజ్ బాజ్ పాయి, కొంకణా సేన్‌తోపాటు నాజర్, షాయాజీ షిండే, రాజీవ్ రవీంద్ర నాథన్ మరియు లాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక కిల్లర్ సూప్‌కు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ మరియు ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదల చేసిన కిల్లర్ సూప్ ట్రైలర్ 2 నిమిషాల 22 సెకన్ల నిడివితో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 11 నుంచి అంటే నేటి నుంచి కిల్లర్ సూప్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం కిల్లర్ సూప్ సిరీస్ త్వరలో రానుందని చూపించారు. ఓటీటీలో కిల్లర్ సూప్ ఫుల్ సిరీసుకు బదులు రెండు ట్రైలర్స్‌తో మేకర్స్ అప్డేట్ చేశారు.అయితే, కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11న అంటే గురువారం సాయంత్రం లేదా రాత్రి 11 గంటల సమయంలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.