Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం రేపింది. మానవ అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఒక మహిళ మృతి చెందడం, పలువురు వైద్యులు, ముఠా సభ్యులు అరెస్టు కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలను పద్మ అనే మహిళ మదనపల్లికి తీసుకొచ్చింది. వీరిపై గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఆ ఆపరేషన్‌లో యమున అనే మహిళ పరిస్థితి విషమించి మరణించింది. దీనితో యమున…