కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రానున్న సినిమా కావటంతో అభిమానుల్లో హడావుడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జతగా కియారా అద్వానీ నటించబోతోందట. కొరటాల ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు కు జోడిగా కియారా నటించింది. మరోసారి కొరటాల దృష్టి ఆమెపైనే ఉందట.…
శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ‘అపరిచితుడు’కి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడట. ‘భరత్ అనే నేను’లో మహేశ్ కి జోడీగా నటించిన కియారా అద్వానినీని రణ్ వీర్ కి జోడీగా ఎంచుకున్నాడట.…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీం పాత్రలో అలరించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌కు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలతో సినిమా చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా…