కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విభాగంలోకి ప్రవేశించింది. ఈవీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా నిర్ణయించింది కియా. మొత్తం రెండు రకాలలో లభించనున్న ఈ మోడల్ రూ.59.95 లక్షలు కాగా, మరొకటి రూ.64.95 లక్షలని పేర్కొంది. విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరింత విస్తరించడానికి రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు, 2025…