వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం రోజుల రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి నిరుద్యోగ నిరాహార దీక్ష చేయాలని షర్మిల సంకల్పించిన సంగతి తెలిసిందే.
Read: మళ్ళీ పెంచేసిన కృతీశెట్టి!