Dog Attack : హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కుక్కలు.. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను తీశాయి.
ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఫోన్ మాట్లాడుతూ వారు ఏం చేస్తున్నారో కూడా మరిచిపోతారు. దిగే స్టేజ్ వచ్చినా అలాగే ప్రయానిస్తూ దానికితోడు కండెక్టర్ మీద నాస్టేజ్ వెళ్లిపోయింది ఎందుకు చెప్పలేదని తిరిగి దాబాయించడం, వారిపై దాడి చేయడం అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది.
గురుబ్రహ్మ..గురు విష్ణు..గురుదేవో మహేశ్వరః ఇది గురువుపట్ల మనం నేర్చుకున్నంది, విన్నది. కానీ విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించినంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు. విద్యార్థుల పట్లు అసభ్యంగా ప్రవర్తించిన గురువును తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఒక మంచి సినిమాని విద్యార్థులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తే…
ఓ స్థల వివాదంలో ఏడు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో కుల బహిష్కరణ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీలో గంతోటి.చిన్నప్ప(మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) తన స్థలానికి సరిహద్దుగా ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఆ స్థలంలో బావి…
రాష్ట్రంలో పేకాట క్లబ్బులను పూర్తిగా నిర్మూలిస్తామని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేస్తుంటే తెలంగాణ పోలీసులు మాత్రం పేకాట రాయుళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. పట్టణాల్లో పేకాట క్లబ్బులు మూతపడడంతో బడాబాబులు గ్రామాల్లో మామిడితోటల్లోని ఫామ్ హౌస్ లను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. పేకాట మీద దాడులు చేస్తున్నట్టు నటిస్తున్న పోలీసు అధికారులు కూడాతృణమో పణమో తీసుకుని వదిలిపెడుతున్నారు. పేకాట స్థావరాల్లో దొరికిన భారీమొత్తాన్ని పోలీసులు నొక్కేశారన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆ…
అది విదేశీ పక్షులకు నెలవు. అక్కడకు ప్రతి ఏటా విదేశీ పక్షులు రావడం.. ఇక్కడనే గుడ్లను పెట్టి పొదిగి.. వాటిని పెంచి.. ఆ పిల్లలతో సహా ఇక్కడ నుంచి మళ్లీ తమ ప్రదేశాలకు వెళ్లడం ప్రతి యేటా సాగుతుంది. అయితే అవి నివాసం ఉంటున్న చింత చెట్లు లేక.. మరోవైపున కోతుల బెడదతో ఆ గ్రామానికి విదేశీ పక్షుల రాక బంద్ అయింది.. అటు పర్యాటక గ్రామంలో తయారుచేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగా తయారయ్యాయి. ఖమ్మం…