Passenger Attack on Conductor: కొందరికి మంచి చెప్పినా చెడే ఎదురవతుంది. మంచి మాటలు వినే రోజులు పోయాయి. అలా చేయొద్దని చెప్పినా మొండితనంతో అదే చేస్తుంటారు కొందరు. కానీ దానివల్ల ప్రాణహాని వుందని మాత్రం గమనించరు. ఫోన్ మాట్లాడుతూ వారు ఏం చేస్తున్నారో కూడా మరిచిపోతారు. దిగే స్టేజ్ వచ్చినా అలాగే ప్రయానిస్తూ దానికితోడు కండెక్టర్ మీద నాస్టేజ్ వెళ్లిపోయింది ఎందుకు చెప్పలేదని తిరిగి దాబాయించడం, వారిపై దాడి చేయడం అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది.
Read also: What an Idea: కర్రల వంతెన… తీరింది కష్టాల యాతన
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.యం.బంజర్ వద్ద ఆర్టీసీ బస్ లోని సమీనా అనే మహిళ కండక్టర్ గా పనిచేస్తుంది. అందులో సాజిత్ అనే ప్రయాణికుడు ఎక్కాడు. టికెట్ తీసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే సాజిత్ దిగే స్టేజ్ వెళ్లిపోయింది. అయినా అది గమనించకుండా సాజిత్ ఫోన్ లో నిమగ్నమయ్యాడు. పోన్ నుంచి తేరుకుని చూడగా తను దిగే స్టేజ్ వెనక్కు వెళ్లిపోయింది. దీంతో కంగారుకంగారుగా రన్నింగ్ బస్సులో నుంచి దిగడానికి ప్రయత్నించాడు. దానికి సమీనా మహిళా కండెక్టర్ దిగద్దంటూ అడ్డుకుంది. దీంతో ప్రయాణికుడు సాజిత్ ఆమెపై దుర్బాషలాడాడు. అయినా సరే వద్దంటూ ఆమె దిగకుండా అడ్డుకుంది దీంతో తీవ్ర ఆగ్రహంతో సాజిత్, కండెక్టర్ సమీనాపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దుర్భాషలాడుతు దాడికి పాల్పడ్డాడు అని దాడికి పాల్పడిన ప్రయాణికుడి పై వి యం బంజర్ పోలీస్ లకు పిర్యాదు చేసినట్లు సమీనా తెలిపింది. అయితే అంత జరుగుతున్న తోటి ప్రయాణికులు ఆ సంఘటనను ఆపేందుకు ప్రయత్నించకపోవడం, దాడి జరుగుతున్న చూస్తుండటంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Xi Jinping: చైనాలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా భారీగా నిరసనలు..