సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ & డిమాండ్ ఉన్నప్పుడు.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదు. కానీ, అది కన్విన్సింగ్ గా ఉండగలగాలి. తాము అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రాగలిగేలా ‘ఫిగర్’ ఉండాలి. అలా కాకుండా, క్రేజ్ వచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు శ్రీనిధి శెట్టి పరిస్థితి అలాగే ఉందని సమాచారం. ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని, అందుకే ఆఫర్లు పెద్దగా రావడం లేదని…
కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.…
యువతపై సినిమాల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు.. వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్ దాకా.. అన్ని అనుసరించడం మొదలుపెడతారు. దాదాపు తమ అభిమాను హీరోలు సినిమాల్లో చేసిన పనులనే, రియల్ లైఫ్‌లోనూ చేయాలని ప్రయత్నిస్తారు. కొందరైతే స్టంట్లు కూడా చేస్తుంటారు. ఇలా చేసి కొందరు లేనిపోని సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ టీనేజ్ కూడా.. తన అభిమాన హీరోలాగే…
విడుదలైనప్పటి నుంచి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, అంచనాలకి తగ్గట్టు ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో అయితే రికార్డుల తాట తీస్తోంది. తొలిరోజు రూ. 53.95 కోట్లు (నెట్) కలెక్ట్ చేసి, బాలీవుడ్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు.. నాలుగో రోజు రూ. 50.35 కోట్లు కొల్లగొట్టి, నాల్గవ రోజు…
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఐదు వారాలు పూర్తి కాకముందే, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే, ఇక్కడో ఫిట్టింగ్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే, రూ. 200 కట్టాల్సి ఉంటుంది. రెంటల్స్ విధానంలో ఈ చిత్రాన్ని అమెజాన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సినిమాలు చూసేందుకు వీలుంటుంది. అయితే.. ఎర్లీ యాక్సెస్‌లో భాగంగా ముందుగానే స్ట్రీమ్ చేస్తుండడంతో, రెంటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకా…
ఏమది? ఎంతటి ఆశ్చర్యం!? దక్షిణాదిన నేడు తెలుగు సినిమారంగంతో పోటీ పడే స్థితి ఎవరికీ లేదే? అటువంటిది ఓ కన్నడ పాన్ ఇండియా మూవీ మన తెలుగు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ రికార్డును అధిగమించుటయా!? ఎంతటి విడ్డూరమూ! రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గా విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఉత్తరాదిన మంచి వసూళ్ళు చూసిందని ఇటీవల హిందీ రైట్స్ తీసుకున్న వారు ముంబయ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాను కూడా ఆహ్వానించి, తమ ఆనందం పంచుకున్నారు.…