కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది.