BJP MLA: కేదార్నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
Rudraprayag : ప్రతేడాది జూన్‌లో కేదార్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. భక్తుల రద్దీని బట్టి ధామ్‌లో ఒక గంటలో 1800 మందికి పైగా భక్తులకు కమిటీ దర్శనం కల్పిస్తుంది.
హిమాలయ దేవాలయాలకు యాత్ర ప్రారంభమైన ఒక రోజు తర్వాత శనివారం చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు కనిపించారు. యమునోత్రి వద్ద భారీగా రద్దీ ఉంది. మొదటి రోజు సుమారు 45,000 మంది యాత్రికులు దర్శనమ్ చేసుకున్నారు. ప్రజలు ఆలయానికి వెళ్లే ఇరుకైన మార్గంలో నడవడం కూడా కష్టమైంది. కేదార్నాథ్ లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ మొదటి రోజు సుమారు 30,000 మంది వచ్చారు. ఇంతలో, ఇద్దరు యాత్రికులు మధ్యప్రదేశ్లోని సాగర్…
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం..…
శివ భక్తుల నిరీక్షణ ఫలించింది. శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. ఉదయం 7.10 గంటలకు కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నగరి 'జై కేదార్' నినాదాలతో మారుమోగింది. ఈరోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కేదార్‌నాథ్ దర్శనం కోసం తరలివచ్చారు.
శివ భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ శుభవార్త చెప్పింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బీకేటీసీ) ప్రకటించింది.
నేడు మహాశివరాత్రి సందర్బంగా శివనామ స్మరణతో ప్రపంచం మొత్తం మారుమ్మోగిపోతుంది.. శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శివ భక్తిని చాటుకుంటున్నారు.. తాజాగా కొందరు బిస్కెట్స్ తో అద్భుతాన్ని సృష్టించారు.. శివయ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని తయారు చేశారు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు.. సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక…
Chardham Templs: శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను బుధవారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు.
గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది. పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు…
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి నడుస్తూ.. మోకాలిపై వంగి ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఈ సన్నివేశంలో అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది దీన్ని ఫోన్లలో బంధించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరిపై విమర్శలు వెల్లువెత్తాయి.