Mobile Phones Banned: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో టెంపుల్ లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ కఠిన చర్యలకు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది.. ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అభిమానుల మెప్పు పొందడం కంటే వారి నుంచి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Read Also: Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..
Also Read
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు పేర్కొనింది.
Read Also: RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..
కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు మన సంప్రదాయ దుస్తులు ధరించాలని ఈ సందర్బంగా శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర తెలియజేశారు. గతంలో కొంతమంది ఇష్టానుసారంగా బట్టలు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదు అని ఆయన అన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ అధ్యక్షుడు హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..