బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉరితీసిన తప్పులేదని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినా.. రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారని స్పష్టం అవుతుందని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగాలని కేసీఆర్ అంటున్నారని.. అంటే ఆ రెండు పార్టీలు ఒకటే నని స్పష్టం అవుతుందన్నారు. నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత స్పందించారు. కేసీఆర్ సభ కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టుగా ఉందని విమర్శించారు. తెలంగాణ విధ్వంసానికి కారణం కేసీఆర్ అన్నారు. సభకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష మందిని కూడా జమ చేయలేక పోయారని ఆరోపించారు.
READ MORE: Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
“సభ అట్టర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది కేసీఆర్ నీకు తెలియదా? అన్ని తెలిసి 11 రూపాయలు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మీరు పాలివ్వలేదని తెలిసే మిమ్మల్ని ప్రజలు ఓడించారు. మావోయిస్టులను చర్చలకు పిలువలేదు కేసీఆర్… మీ ప్రభుత్వంలో ఎన్కౌంటర్ లు చేయలేదా? హింసను వీడనాడి జన జీవనంలోకి రావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చెయ్యి.. అధికారం కోల్పోయి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు… గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపి ఆ తరవాత వాళ్ళను చంపింది నిజం కాదా… ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములే కదా? తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని పగటి కలలు కంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు అసహ్యించుకుంటారు తప్ప మిమ్మల్ని అక్కున చేర్చుకోరు. బీర్ఎస్ మోడల్ అంటే దుర్మార్గం, కుటుంబ పాలన, విధ్వంసం, అరాచకం. కాళేశ్వరం గురించి కెసిఆర్ ఎందుకు మాట్లాడరు. అది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పి పోతల పథకం.” అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Preity Zinta: ఐపీఎల్ మధ్యలో భర్తతో కలిసి చిల్ అవుతున్న పంజాబ్ ఓనర్