బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై లైంగిక దాడి జరిగిందని వార్తలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. నటి చౌరాసియా పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, కేవలం సెల్‌ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని వారు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు…