బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) వేదికపై.. మరోసారి భావోద్వేగానికి లోనై, ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించారు. గత 25 ఏళ్లుగా ఈ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న బిగ్ బీ, సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే కేటాయించానని, సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం…