తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్.
Legislative Council : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఉభయ సభల్లో కులగణన , ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, కులగణన లెక్కలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, తమకు ఈ విషయంలో తగిన అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ డేటా వివరాలు ఇప్పటివరకు అందరికీ అందుబాటులో లేవని…
Thatikonda Rajaiah : స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతరంగికుడిగా ఉన్న కడియం.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమన ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, పార్టీకి పుట్టిన పిల్లలను.. కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని…
కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నారు. కానీ... ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న?
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో…
2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Ponguleti Srinivas: కార్ల రేసింగ్తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణాల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫైర్ అయ్యారు.
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్…
Delhi liquor Case : మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.