తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న అనంతరం బీఆర్ఎస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తాజాగా కొత్త రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. తండ్రి పార్టీ…
కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్‌తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రెస్ మీట్ ముగింపు సమయంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తుచేశారు.
కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్…
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా! ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల…
పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.