ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రెస్ మీట్ ముగింపు సమయంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తుచేశారు.
కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్…
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా! ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల…
పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి విషయంలో గొడవలు ఇంటి నుంచి రోడ్డెక్కాయంటున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతూ వస్తున్నారు.
Jagadish Reddy : బీఆర్ఎస్లో నెలకొన్న విభేదాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “నా ఉద్యమ ప్రస్థానంపై ఉన్న జ్ఞానానికి కవితకు జోహార్లు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన, “కేసీఆర్కు బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏమి మాట్లాడుతున్నారో అదే పదాలను కవిత వాడుతున్నారు” అని విమర్శించారు. “వాళ్లు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు” అంటూ…