Jai Shankar: జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
హల్గామ్ ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల కాశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ దాడి జరగడంతో ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు భయపడుతున్నారు. అయితే, ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు.