టీవీకే అధినేత విజయ్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను కలిసేందుకు పరామర్శ బాటపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేసి విషయం తెలియజేశారు.
Stampede: తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అధికార డీఎంకే పార్టీ నేతలు విజయ్‌పై విరుచుకుపడుతున్నారు. పోలీసు నిబంధనలు పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడుతున్నారు. ఈ విషాద ఘటనలో 40 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు.