Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు…