దేశంలో వరకట్న చావులు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబలలు బలైపోతున్నారు. ఇటీవల వరకట్న వేధింపులు కారణంగా శిల్ప అనే వివాహిత ప్రాణాలు తీసుకోగా.. తాజాగా బెంగళూరులో బ్యాంక్ ఉద్యోగి ప్రాణాలు తీసుకుంది.
బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల పూజశ్రీ అనే మహిళ బ్యాంక్‌లో పని చేస్తుంటుంది. ఇంట్లో భర్త వరకట్న వేధింపులు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా భర్త అక్రమ సంబంధం కారణంగా కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పూజశ్రీ ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్‌గా పని చేస్తున్న పూజశ్రీ మూడేళ్ల క్రితం నందీప్‌ను వివాహం చేసుకుందని.. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉందని తెలిపారు. అయితే భర్తకు అక్రమ సంబంధం ఉందని బయటపడిన తర్వాత ఇంట్లో వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. కట్నం డిమాండ్ చేయడమే కాకుండా రోజూ భార్యతో గొడవలు పడుతున్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
నందీష్ వివాహేతర సంబంధం కారణంగా పూజశ్రీని నిరంతరం హింసించేవాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. కూతురి పెళ్లి కోసం రూ.30లక్షలు అప్పు చేసినట్లు వెల్లడించింది. పోలీస్ స్టేషన్‌లో వేధించనని హామీ ఇచ్చాక కూడా వేధింపులు ఎక్కువయ్యాయని.. అక్రమ సంబంధం కారణంగానే ఇదంతా జరిగిందని ఆమె వేదన చెందింది.