కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే కేరళలో పెరుగుతున్న కేసులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతు న్నాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.తాజాగా కేరళలో కొత్తగా 6,444 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మరోవైపు 187 మంది కరోనాతో మరణించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,80,398కు చేరగా.. మరణాల సంఖ్య 32,236కు పెరిగింది. కేరళలో మరో8,424 మంది వైరస్‌ను జయించినట్టు ఆ రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది.…
కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైన తరువాత సరిహద్దు వివాదాలు నెలకొన్నాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని, సరిహద్దుల్లోని ప్రాంతాలకు పాత పేర్లు ఉండటం వలనే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని తెలిపారు. Read: ఆ కేసులో మాజీ మంత్రి అరెస్ట్… ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఇంకా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హిరోగానే కాకుండా పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. పునీత్ తండ్రి కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేశాడు. తండ్రి బాటలోనే పునీత్ రాజ్‌కుమార్ నడిచి ఆయన కళ్లను దానం చేశారు. పునీత్ చివరకు చనిపోతూ కూడా నలుగురికి కంటిచూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు ఈ స్టార్ హీరో. ఆయన దానం చేసిన కళ్లతో ఒకే…
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా మరికొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం నాడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పునీత్ భౌతిక కాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన…
చేపల కోసం గాలం వేస్తున్న బాలుడిని లాక్కెళ్లిన మొసలి ఉదంతం ఇది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నది ఒడ్డున కూర్చుని చేపలకు గాలం వేస్తున్నాడు ఓ బాలుడు. నదిలో మొసలి వుందన్న సంగతి ఆ చిన్నారికి తెలీదు. దీంతో ఆ మొసలి దాడిచేసి కుర్రాడిని లాక్కెళ్లిపోయింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగరలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని…
దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో…
భారత దేశంలో ఆధునిక మహిళలకు పెళ్లి, పిల్లలు అక్కర్లేదు అనుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్.. నేటి మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారని, పెళ్లైన తర్వాత కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదన్న ఆయన.. సరోగసీ ద్వారా సంతానానికి జన్మనివ్వాలని భావిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోందని.. మా మార్పు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు… ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బెంగళూరులో…
బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేశారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సన్నిహితుడు…