కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే కేరళలో పెరుగుతున్న కేసులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతు న్నాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.తాజాగా కేరళలో కొత్తగా 6,444 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మరోవైపు 187 మంది కరోనాతో మరణించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,80,398కు చేరగా.. మరణాల సంఖ్య 32,236కు పెరిగింది. కేరళలో మరో8,424 మంది వైరస్‌ను జయించినట్టు ఆ రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ప్రస్తుతం కేరళలో 74,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 34 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ కారణంగా ఎవ్వరూ మరణించలేదని ఢిల్లీ సర్కార్ తెలిపింది. కర్ణాటకలో 239 కరోనా కేసులు బయట పడ్డాయి.మరో ఐదుగురు మరణించారని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.