DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.