Karnataka: అవినీతి మంత్రి ఈశ్వరప్పపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటకలో ఎప్పుడూ హాట్ హాట్ రాజకీయాలు నడుస్తుంటాయి. తాజాగా మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాకిచ్చింది. అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగానూ పేరుపొందిన బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై బీజేపీ వేటేసింది. మంత్రిగా ఉండి మతఘర్షణలకు ఊతమిస్తున్నారనే విమర్శలకు తోడు సామాన్యులను బెదిరించి, వారి మరణాలకూ కారకుడవుతున్నారని ఈశ్వరప్పపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా సంతోష్ పాటిల్ అనే గవర్నమెంట్ రోడ్డు కాంట్రాక్టర్ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపేసింది.
దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వివాదంపై సీఎం స్పందించారు. దీనిపై వస్తున్న తీవ్ర వత్తిడుల నేపథ్యంలో ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించేందుకు సిద్దమైంది బొమ్మై ప్రభుత్వం. ఆయనపై కేసు నమోదు తర్వాత పరిణామాలు వేగంగా మారడంతో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. నాలుగు కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పనుల్లో తన వద్ద నుంచి లంచంగా మంత్రి, అతని సహాయకులు 40శాతం డిమాండ్ చేశారు. ఈ వత్తిడి తట్టుకోలేక తాను చనిపోతున్నట్టు సూసైడ్ లేఖలో రాయడంతో మంత్రి పై కేస్ బుక్ అయ్యింది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కు మంత్రి వేధింపులే కారణమని మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ కూడా ఆరోపించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే సంతోష్ పాటిల్ ఆత్మహత్య పై కాంగ్రెస్ మండిపడింది. విధాన సభ ముందు కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ..మరియు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చాంబర్ వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఈశ్వరప్ప పేరు ఉన్నా.. మంత్రిని అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వారు ఆరోపించారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!