రేణుకాస్వామి హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్ చాలా రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఇప్పుడు చికిత్స చేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మైసూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్ వాదించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. బళ్లారికి చెందిన విమ్స్ వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్టు,…