కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ముఖ్యమంత్రి పదవికోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నూతన ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. ప్రాంతం, కులం, సీనియారిటీ, ఎమ్మెల్యేల మనోగతం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నిర్ణయించడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవడంతో ఇద్దరు ప్రధాన పోటీదారులు-డీకే శివకుమార్, సిద్ధరామయ్య- పార్టీ హైకమాండ్‌తో వివరణాత్మక చర్చ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్.. ఇలా ఎవరి అంచనాలకు దొరకకుండా గెలుపును తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ.. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. అయితే, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధరామయ్య సీఎం అవుతారా? ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం చైర్‌లో కూర్చోబోతున్నారా? అనేది…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమయం సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ, జేడీఎస్‌లు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘777 చార్లీ’. కిరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. పెంపుడు కుక్క ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ‘777 చార్లీ’ సినిమాను వీక్షించి కంటతడి…