కర్ణాటక రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించేదెవరో అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీని పూర్తిగా విశ్వసించని కన్నడ ప్రజలు ఈ సారి మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది. వచ్చే ఏటా నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని విశ్లేషణలు ఊపందుకున్న సమయంలో ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
Karnataka Assembly Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లెక్కింపు ఉదయం 8గంటలకు మొదలవుతోంది. తొలి రౌండ్ 9 గంటలకు పూర్తవుతుంది. బెంగళూరు సిటీలో 4 కేంద్రాలు, మిగతా జిల్లాల్లో 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తం 73.19 శాతం పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా చికబల్లాపురా నియోజకవర్గ లో…